స్ట్రోక్ నివార‌ణ‌కు తొలి గంటే అత్యంత కీల‌కం…

-అను న్యూరోలో వ‌ర‌ల్డ్ స్ట్రోక్ డే ముగింపు కార్య‌క్ర‌మం
-ఒత్తిడి లేని జీవితాన్ని అధిగ‌మించ‌డం ముఖ్యం
-అను న్యూరో వైద్య‌బృందం డాక్ట‌ర్ తీగ‌ల ర‌మేష్‌, డాక్ట‌ర్ తోట న‌వీన్‌, డాక్ట‌ర్ న‌ట‌రాజ్ వెల్ల‌డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌: నిత్యం ప‌ని ఒత్తిడిలో ఉంటూ ఆరోగ్యం ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఆ ప్ర‌భావం మెద‌డుపై ప‌డి త‌ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని అను న్యూరో వైద్య‌బృందం డాక్ట‌ర్ తీగ‌ల ర‌మేష్‌, డాక్ట‌ర్ తోట న‌వీన్‌, డాక్ట‌ర్ న‌ట‌రాజ్‌లు స్ప‌ష్టం చేశారు. శ‌నివారంనాడు ఎనికేపాడులోని అను న్యూరో అండ్ కార్డియాక్ ఇనిస్టిట్యూట్‌లో జ‌రిగిన ముగింపు కార్య‌క్ర‌మంలో వారు మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ సంభ‌వించిన వెంట‌నే మొద‌టి గంట ఎంతో కీల‌క‌మ‌ని అటువంటి స‌మ‌యంలో రోగిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లిస్తే ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవ‌చ్చ‌ని తెలిపారు. ముఖ్యంగా న్యూరాల‌జీ ల‌క్ష‌ణాలు ప‌క్ష‌వాతం, కండ‌రాల బ‌ల‌హీన‌త‌, మూతి వంక‌ర పోవ‌డం, ముఖ ప‌క్ష‌వాతం, మ‌ణిక‌ట్టు లేప‌లేక‌పోవ‌డం, మెడ మ‌రియు న‌డుము వ‌ద్ద వ‌చ్చే స్పాండిలైటీస్‌, కాళ్లు, చేతుల్లో తిమ్మెర్లు, పార్కిన్‌స‌న్ డిసీజ్‌, స్పోర్ట్స్ ఇంజూరీస్ వంటి ల‌క్ష‌ణాలు వ‌ల్ల న్యూరాల‌జీ స‌మ‌స్య‌లు సంభ‌వించి త‌ద్వారా నిర్ల‌క్ష్యం వ‌హిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. కాబ‌ట్టి ఒత్తిడి లేని జీవితం గ‌డ‌ప‌డం, ఆహార నియ‌మాలు పాటించ‌డం, శ‌రీర ధృఢ‌త్వం కోసం నిత్యం గంట‌సేపు వ్యాయామం చేయ‌డం వంటివి అల‌ర్చుకోవాల‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా స్ట్రోక్ స్కీనింగ్ ప్యాకేజీని ప్ర‌క‌టించారు. కేవ‌లం రూ.4,999ల‌కే బ్రెయిన్ ఎమ్మారై, ఇసీజీ, టూడీ ఎకో, సీబీసీ, ఆర్‌.ఎఫ్‌.టి., ఆర్బీఎస్ వంటి ప్యాకేజీ ల‌భిస్తుంద‌ని తెలిపారు. ఈ స‌ద‌వ‌కాశాన్ని న‌గ‌ర‌వాసులు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *