సీఎం రిలీఫ్ ఫండ్ రూ.7.50 లక్షలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆరుగురికి వైద్య ఖర్చుల కోసం రూ.7లక్షల 50 వేలు అందించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు మంత్రి అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు ఉంటూ, ఆపదలో అన్నలా సంక్షేమ పథకాలతో ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటారని తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో ఆరుగురు బాధితులకు వైద్య ఖర్చులు కోసం వెచ్చించి ఖర్చును రెయింబర్స్ మెంట్ కోసం చేసుకున్న దరఖాస్తు లను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తాను సిఫార్సు చెయ్యడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ రూ.7.50 లక్షలు:
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సత్యవాడా ఉదయ్ కార్తీక్ కి రూ.2 లక్షల 50 వేలు, వలవల నాగశివ కి రూ.3 లక్షల 75 వేలు, దుండి బోస్ రూ.37 వేలు, గంజిరాజు మునీశ్వర రావు రూ.27 వేలు, కెవివిఎస్ ఎస్ పవన్ కుమార్ రూ.20 వేలు, సంగం దుర్గా రూ.16 వేలు మొత్తాన్నీ మంత్రి బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కు రూపంలో అందచేయ్యడం జరిగింది. కార్యక్రమంలో ఎంపిపి కాకర్ల నారాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *