
-అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు…
-విత్తనం నుంచి విక్రయం దాకా రైతుకు అన్నిసేవలు ఆర్బీకేలు ద్వారా లభ్యం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసాను అందిస్తూ ఆదుకుంటుంది. ప్రజల ఆకలి తీర్చి అన్నం పెట్టే రైతన్న గతంలో విత్తణాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు విషయంలో దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నాడు. నేడు వారు నివశిస్తున్న పల్లేల్లోనే రైతు భరోసా కేంద్రాలు ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభ్యం కావడంతో రైతు కళ్లల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. సాగుబడికి స్వేచ్ఛతో పాటు నేడు రైతు దేనికీ తలవంచాల్సిన పని లేదు. రైతు నివశించే ప్రాంతానికే అన్ని వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు స్వల్పకాలంలోనే సత్ఫలితాలను ఇస్తూ పల్లెల్లో పెను విప్లవానికి నాంది పలికాయి.
జిల్లాలో రూరల్ ప్రాంతాల్లో 801, అర్బన్ ప్రాంతాల్లో 13 ఆర్బీకేల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చుడం జరుగుతుంది. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందులు సరఫరా జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గ్రామ స్థాయి అధికారులు, రైతులకు అందుబాటులో వుండి పంటలపై వచ్చు చీడ పీడలు, పొలంబడి శిక్షణా కార్యక్రమాలు, వివిధ పంటలపై సలహాలు, రైతు బృందాల ఏర్పాటు మరియు ఆక్వాకల్చర్ రైతులకు నాణ్యమైన ఫీడ్, పశువుల కోసం ఆరోగ్య కార్డులను జారీ చేస్తారు. ప్రతీ నియోజవర్గస్థాయిలో డా. వైఎస్ఆర్ సమీకృత వ్యవసాయ మరియు ఆక్వాటెస్టింగ్ లాబరేటరీలు నిర్మాణాలను చేపట్టడం జరిగింది. జిల్లాలో 7 అగ్రిటెస్టింగ్, 5 అగ్రి అండ్ ఆక్వా టెస్టింగ్ లాబరేటరీలు తో పాటు జిల్లా స్థాయిలో ఒక సమీకృత అగ్రి టెస్టింగ్ లాబరేటరీ నిర్మించడం జరుగుతుంది.
నవరత్నాల్లో భాగంగా ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతు పంట ఉత్పాదకత మెరుగుపర్చడం, సాగు ఖర్చు తగ్గించడంతో పాటు విత్తనం మొదలు విక్రయం వరకు రైతు ఇంటి ముంగిటకి అందించడమే లక్ష్యం. ఈ పంట నమోదు పంటల బీమా పరిహారం, పొలంబడి శిక్షణ మరియు ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు పంటల సాగులో మెలుకువలు తెలియచేయుట, పంట నష్ట పరిహార జాబితాను తయారుచేయుట, అర్హులైన రైతులకు రైతు భరోసా పథకమును వర్తింపజేయడం, కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్య సేకరణ, ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి. ఆర్బీకేల్లో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఏ పంటకు ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు. షాపులో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు, తదితరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు. సరసమైన ధరకు ఇక్కడ అందజేస్తారు. కియోస్క్ ద్వారా రైతు తనకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తే 48 నుంచి 72 గంటల్లో సరఫరా చేస్తారు. భూసార పరీక్ష చేయించుకునే సౌకర్యం ఉంటుంది. ఆర్‌బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆడియో, వీడియోల సాయంతో మెళకువలు నేర్పుతారు. సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణ ఇస్తారు.
వైయస్సార్ పొలంబడి క్షేత్ర ప్రదర్శన – నూతన ఒరవడి :-
పంటల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వ్యవసాయాధికారులతో పాటు సచివాలయ ఉద్యోగులను ఇందులో భాగస్వాములను చేసింది. వీరంతా జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగుపై వ్యయాన్ని తగ్గించి దిగుబడిని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యవసాయ సలహా మండలి సమావేశాలు :-
రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహా మండలి సమావేశాలు విధిగా మొదటి శుక్రవారం ఆర్ బి కె లెవల్లో, మండలాల్లో రెండవ శుక్రవారం, జిల్లా స్థాయిలో మూడో శుక్రవారం నిర్వహిస్తూ వ్యవసాయ అధికారులు సమీశ్రిస్తూ గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళికలు సిద్ధంతో పాటు రైతులకు నెలకొన్న సమస్యలు, రైతులకు అందాల్సిన సంక్షేమ సేవలు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చిస్తారు.
ఒకే సారి మూడు పథకాల ద్వారా రైతనన్నకు ప్రభుత్వం సాయం:-
రైతు సంక్షేమమే లక్ష్యంగా ఒకే సారి మూడు పథకాల ద్వారా రైతనన్నకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. జిల్లాలో డా. వైఎస్ఆర్ రైతు భరోసా – పియం కిసాన్ పథకం క్రింద గత రెండేళ్లలో పెట్టుసాయం గా రైతులకు ఒక్కోక్కరికీ రూ.13,500/- చొప్పున 3,26,326 మంది రైతులకు రూ.809.36 కోట్లను అందించగా మూడవ ఏడాది రెండవ విడతగా 313195 మంది రైతులకు రూ.67.92 కోట్లు అందించి ఆదుకుంది. డా. వైఎస్.ఆర్ సున్నావడ్డీ పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్లలో లక్ష రూపాయలు రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించిన రైతులకు రెండేళ్ల కాలంలో 1,22,879 మంది రైతులకు రూ.26.24 కోట్లు వైఎస్సార్ సున్నావడ్డీగా రాయితీని రైతులఖాతాల్లో జమ చేసింది. 2020 ఖరీఫ్ పంటకు సంబందించి 34677మంది రైతులకు రూ. 5.51కోట్లు సున్నా వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమచేశారు. డా.వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల(సీహెచ్ సీ) ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ఈ ఏడాది జూలైలో 70 యంత్ర సేవా గ్రూపుల్లోని 354 మంది రైతులకు రూ.97 లక్షలు, అక్టోబరు 26న 136 యంత్ర సేవా గ్రూపుల్లోని 354 మంది రైతులకు రూ.1.76 కోట్లు 40శాతం సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయడంజ జరిగింది.
డా. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద జిల్లాలో సాగు చేసే ప్రతీ ఎకరం ఈ పంటలో నమోదు చేయించుకున్న రైతు ఒక్క పైసా కూడా ప్రీమియం చెల్లించకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేసింది. ఇందులో భాగంగా 2020 ఖరీఫ్ పంట నవంబరులో వచ్చిన నివర్ తుఫాను మరియు అధిక వర్షాలు వలన పంటలు నష్టపోయిన రైతులుకు ఈ పథకం కింద 84,648 రైతులకు రూ. 170.44 కోట్లు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.
రైతుల మాటల్లో విందాం..
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు :-
నాపేరు చిందా పవన్ కుమార్ రాజు మాది ఉయ్యూరు మండలం కాంటూరు గ్రామం గతంలో వ్యవసాయం సాగులో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాడిని, నేడు ఆ పరిస్థిలు లేవు. నేను సొంతంగా 4 ఎకరాలు, కౌలుకు 50 ఎకరాలు సేద్యం చేస్తాను. నారు సమయంలో మొదటి విడత, ఎరువులు,పురుగు మందులు చల్లే సమయంలో రెండవ విడత, కోతలు, కట్టేతలు సమయంలో మూడవ విడత రైతుభరోసాను అందించి ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా గ్రూపు సభ్యుల రూ. 15 లక్షలు తీసుకొని ట్రాక్టరు, లేజర్ బ్లేడ్స్, రోటోవిటా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసాం. నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.
రైతు పక్షపాతిగా రైతు ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని ఆదుకుంటున్న సీయంకు కృతజ్ఞతలు :-
నా పేరు ఓబిలినేని రంగారావు మాది గన్నవరం మండలం గన్నవరం గ్రామం నేను సొంతంగా రెండేకరాలు, కౌలుగు ఆరు ఎకరాలు సేద్యం చేస్తున్నాను. గతంలో రెండు, లేదా మూడు రూపాలయకు వడ్డికి తెచ్చి వ్యవసాయనికి పెట్టుబడి పెట్టేవారమని నేడు ఆపరిస్థితి లేకుండా రైతు భరోసా, సున్నావడ్డీ రాయితీ, వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ పనుముట్లు రాయితీని అందిస్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారు. ఇక పంట చివరిలో ఇబ్బందులు లేకుండా ధాన్యానికి గిట్టుబాటు ధరను అందిస్తూ కళ్లాల్లోనే కొనుగోలు చేస్తున్న సీయం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు.
జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయ పండుగలా చేస్తున్నా:-
నాపేరు పామర్తి బెనర్జి మాది పెడన మండలం పెడన గ్రామం తాను కౌలు రైతును వ్యవసాయంపైనే ఆదారపడి జీవిస్తున్నాను. నేను పది ఎకరాలు కౌలుగు సాగుచేస్తున్నాను. నాకు రైతు భరోసాగా ద్వారా ప్రతి ఏడాది రూ.13500 రూపాయలు వస్తున్నాయి. ఇన్పఫుట్ సబ్సిడీగా రూ. 30 వేలు, వైఎస్సార్ ఉచిత పంటల భీమాగా రూ.82,600 రూపాయలు అందాయి. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని సాగు చేస్తూ సంతోషంగా ఉన్నాను.
Prajavartha Online Telugu News