అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ శైవక్షేత్రం గా భాసిల్లుతున్న శ్రీ శ్రీ త్రికోటేశ్వర స్వామి ని శనివారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిల్హరి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం మర్యాదలతో కార్యనిర్వహణాధికారి వేద పండితులు ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేష వస్త్రం తో సత్కరించారు ప్రసాదాలు అందజేశారు. త్రికోటేశ్వర స్వామి ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు జస్టిస్ రవినాధ్ పేర్కొన్నారు వారికి బందోబస్తు గా నరసరావుపేట రూరల్ సీఐ వై. అచ్చయ్య అయన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా కోర్టు, మరియు ఇతర కోర్టుల న్యాయమూర్తులు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటి రెడ్డి సీనియర్ అధికారి నాగిరెడ్డి ఆలయ పండితులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News