విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించడానికి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే నిపుణుల తో సలహాలు సూచనలు ఇచ్చేలా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న జమాక్ కో ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ మరియు ఐలా వారి ఆధ్వర్యంలో మౌనిక క్లినిక్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ వారి సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీ నందు మౌనిక క్లినిక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన అవినాష్ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జమాక్ సొసైటీ,ఐలా సభ్యులను ,క్లినిక్ యాజమాన్యనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలా ప్రసాద్,డివిజన్ ఇన్ ఛార్జ్ శ్రీమతి గల్లా పద్మావతి, పాతూరి సాంబశివ రావు, త్రిపురనేని చందు, జమ్ముల ప్రసాద్, బొడ్డు తరుణ్, గల్లా రవి, వేమూరి సామ్రాట్, రిజ్వాన్, కత్తి శివ నాగేశ్వరావు, త్రినాధ్ , షౌకత్ అలీ, బాబు బై, జి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News