విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆంధ్రా లయోలా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెమినార్ హాల్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డే మరియు క్లీన్ ఇండియా ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాష్ జిల్లా పంచాయతీపంచాయతీ అధికారి జ్యోతి స్టెప్ సీఈవో శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రిన్సిపాల్ మహేష్ అసిస్టెంట్ డైరెక్టర్ బాలస్వామి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి సుంకర రాము పాల్గొన్నారు. సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకున్నారు. అఖండ భారతావని నిర్మాణంలో ఉక్కు సంకల్పంతో సంస్థానాలను విలీనం చేసి సమైక్య భారతాన్ని నిర్మించిన ఉక్కు మనిషి చూపిన దృఢ సంకల్పం ప్రతి ఒక్కరికి మార్గదర్శని అలాగే యువతీ యువకులు అందరూ మన మూలాలను గుర్తించి దేశ సంస్కృతి సాంప్రదాయాలు సమున్నత చరిత్రని భావితరాలకు అందించే విధంగా శారీరకంగాను మానసికంగానూ ధ్రుడం గా ఉండి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకొని స్వచ్ఛభారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అందుకుగాను ఈ క్లీన్ ఇండియా అనగా ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాల్లోనూ ఫిట్ ఇండియా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని ముఖ్యఅతిథి జడ్పీ సీఈవో పిలుపునిచ్చారు. కళాశాల డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు తదనంతరం జిల్లా పంచాయతీ అధికారి జ్యోతి జల ప్రతిజ్ఞ చేయించి ఆహుతులు అందరి సమక్షంలో క్యాచ్ ద రైన్ ఫేస్ 2 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమమైన క్లీన్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఒకటేనని వంద రోజులు నిర్వహించే క్లీన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు ఎన్ ఎస్ ఎస్ వారికి ఎన్జీవోలు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి కో య సుధా యూత్ ఎంగేజ్మెంట్ బాజీ మహమ్మద్ శ్రీ కృష్ణ దేవరాయ యూత్ బి వినోద్ కుమార్ మొదలైన వారికి సర్టిఫికెట్లు అతిధుల చేతులమీదుగా బహూకరించడం జరిగింది. అతిథులందరికీ జ్ఞాపికలు బహూకరించడం తర్వాత జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది అంతకుముందు కళాశాల ప్రాంగణంలో క్లీన్ ఇండియా కార్యక్రమం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు జాతీయ వాలంటీర్లు కలసి ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
Prajavartha Online Telugu News