గన్నవరం నియోజకవర్గంలో 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న 55 మంది దరఖాస్తుదారులకు కూడా నేడు ఆర్థిక సాయం అందజేత

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు నుంచి పెండింగ్‌లో ఉన్న 55 మంది లబ్ధిదారులకు కూడా ఈరోజు చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. గన్నవరం మండలానికి చెందిన 43 మందికి రూ.21,55,315, బాపులపాడు మండలానికి చెందిన 30 మందికి రూ.19,04,665, ఉంగుటూరు మండలానికి చెందిన 13 మందికి రూ.8,88,701, విజయవాడ రూరల్ ప్రాంతానికి చెందిన 35 మందికి రూ.27,42,596, ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరికి రూ.56,360 మొత్తాన్ని పంపిణీ చేసినట్లు వివరించారు. నియోజకవర్గంలో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పీహెచ్‌సీ, సీహెచ్‌సీ కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరంలో గౌడపేట, సాలిపేట, చెంచూల కాలనీ, ఎస్సీ కాలనీలలో ప్రయోగాత్మకంగా ఇంటింటికీ వెళ్లి రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రూ.4 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో సీహెచ్‌సీ కి త్వరలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చెరువుల పూడిక మట్టిని పేద ప్రజలు తమ ఇళ్ల స్థలాల మెరక కోసం, రైతులు తమ వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని సూచించారు. కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించి ఎటువంటి అక్రమాలకు తావులేకుండా మట్టిని వినియోగించుకోవాలని కోరారు. గతంలో జరిగిన మట్టి మాఫియా అక్రమాలకు ఈ ప్రభుత్వం పూర్తిగా అడ్డుకట్ట వేసిందని స్పష్టం చేశారు. నిరుపేదల వైద్య అవసరాల కోసం తక్షణమే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్.ఎస్.పి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, ఉంగుటూరు మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, దొంతు చిన్నా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ పాలడుగు మల్లికార్జునరావు, బోడపాటి రవి, కుందేటి చంద్రశేఖర్, బెజవాడ నాగేశ్వరరావు, కొసరాజు సాయిరాం, మేడేపల్లి రమ, చల్లగుల్ల సందీప్, బుస్సే నాగప్రసాద్, చల్లగాలి సునీల్, కలతోటి శ్రీనివాసరెడ్డి, బేతాళ ప్రమీలా రాణి, మాదు శివరాం ప్రసాద్, అట్లూరి నాని, పోతినేని రామకృష్ణ, తంగిరాల శ్రీనివాసరావు, సూరిబోయిన రాంబాబు, బండి భాస్కర్, వేగే కృష్ణారావు, తూమాటి సాంబశివరావు, కడియాల రాజశేఖర్, కొల్లూరు చంద్రకాంత్ మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు

– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *