-రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి
-వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ని శాశ్వతంగా అందిస్తాం…25 ఏళ్ళ పాటు వై యస్ ఆర్ ఉచిత విద్యుత్ పథకం అప్రతిహతంగా కొనసాగిస్తాం…
-నూతన డిస్కొమ్ వల్ల ఏర్పడే అదనపు వ్యయం ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది…
-రైతులకు పూర్తిగా ఉచితంగానే వ్యవసాయ విద్యుత్ … రైతులపై పైసా భారం పడనీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయానికి రానున్న 25 ఏళ్లపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు పగటిపూటే 9 గంటల సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేసారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసారు .
ప్రతిష్టాతకమైన నవరత్నాలలో భాగంగా రాష్టం లో వ్యవసాయ రంగానికి పగటి పూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం గా అమలు చేస్తుందన్నారు . ఇందుకోసం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ . 8,559 కోట్లు కేటాయించింది.
రెండేళ్ళ క్రితం వరకు రాష్టం లో 9 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేసేసామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లు(3854) 58 శాతం మాతమ్ర మే ఉన్నాయి. అందువల్ల పభ్రుత్వం రూ 1,700 కోట్లను కేటాయించి ఉచిత విద్యుత్తు కోసం అప్గ్రేడ్ చేయించింది . ఫలితంగా గత రబీ సీషన్ నుండి రాష్ట్రంలో నూరు శాతం (సుమారు 18 లక్షలు) వ్యవసాయ ఫీడర్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాము. తద్వారా రాష్ట్రంలో ని రైతాంగం పెద్దఎత్తున్న ప్రయోజనం పొందుతున్నది.
శాశ్వత పథకంగా ఉచిత విద్యుత్తు :
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు శాశ్వత పథకంగా మార్చేందుకు పభ్రుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసా విద్యుత్తు సరఫరా కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (SECI ) తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది . దీనివల్ల ఒక యూనిట్ రూ. 2. 49 పైసలు చొప్పున ఏడాదికి 7,000 మెగా వాట్లు విద్యుత్తు ను పాతికేళ్ళపాటు కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. అలాగే రాష్ట్రంలో లో సుమారు 18 లక్షలు ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రానున్న 25 ఏళ్ళ పాటు పగటిపూటే 9 గంటల లు ఉచిత విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం గా వుంది . విద్యుత్తు సరఫరా లో ఎలాంటి లోటు పాట్లు లు లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందించాలని ప్రభుత్య లక్ష్యం.
ఇందు నిమిత్తం వ్యవసాయ విద్యుత్తు సరఫరా కోసమే ప్రత్యేకంగా ఆంధ్ర ప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కంపెనీ ని ఏర్పాటు చేస్తుంది. కేవలం దీర్ఘ కాలంలో రాష్ట్రములోని రైతులు, వ్యవసాయరంగ ప్రయోజనాలను కాపాడేందుకోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . దీని వల్ల రైతులపై ఎలాంటి భారం, అంటే పైసా భారం కూడా పడదని ప్రభుత్వం తరుపున స్పష్టం చేస్తున్నాము. “రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా ఉచితం గానే విద్యుత్తు ని సరఫరా చేస్తుంది. రైతులపై ఎలాంటి భారం పడనీయదు. వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా కు సంబంధించి ప్రస్తుతం డిస్కోమ్ లకు ఎలాంటి ఆర్థిక సహాయం / తోడ్పాటు అందిస్తుందో అలాంటి తోడ్పాటునే కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రూరల్ అగ్రికల్చరల్ సప్లై కు అందజేస్తుంది . ఉచిత వ్యవసాయ విద్యుత్తు తరహాలో ఈ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేస్తున్నాము. రైతులలో అనుమానాలు రేకెత్తిచేందుకు, గందరగోళం సృష్టించేందుకు కొందరు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొదని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రైతుల ప్రయోజనాలను కాపాడేందుకోసమే“ అని మంత్రి స్పష్టం చేసారు .
రాష్టంలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు, పంటలకు సాగునీటి భదత్ర కల్పించేందుకు , రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉచిత విద్యుత్తు విశేషంగా దోహదం చేస్తుంది. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తు పథకం వలన రాష్ట్రంలో ని ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని తెలియజేసుందుకు సంతోషిస్తున్నాము.
Prajavartha Online Telugu News