విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
6వ జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ధర్మపధంలోని భాగంగా స్థానిక బాపు మ్యూజియంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్ నిర్వహణలో వేదపండితులు శ్రీ ధన్వంతరీ పూజ, ధన్వంతరీ అష్టోత్తరములు, ఆరోగ్య ఆశీస్సులు అందచేశారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి రచించిన ఆహారం, ఆయుర్వేదం, ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జి వాణి మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఆనంతరం వాణీ మోహన్ మాట్లాడుతూ ఆయుష్ వారి సూచనల ప్రకారం మంచి ముడి బియ్యం, గో ఆధారిత వ్యవసాయం తో పండించిన కూరగాయలు,వంటింట్లో ని పసుపు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వాడటం వలన క్యాన్సర్ కూడా రాకుండా నివారించవచ్చని తెలిపారు. యోగా సాధన, ఆయుర్వేద ఆహార ఆచరణ వలన మనస్సు ఆనందం గా ఉండటం,మనిషి ఆరోగ్యం గా ఉండి ప్రతి పనీ ఇష్టంగా చేసి దేశ అభివృద్ధి కిపాటు పడాలన్నారు.ఆహారం మంచిది అయితే మందులు లేకుండా నిండు నూరేళ్ళు జీవించవచ్చు అని సూచించారు. పుస్తకం లో ధనియాలు, నేరేడు పళ్ళు ప్రతి నిత్యం ఉపయోగించి గ్యాస్ త్రబుల, ప్రమేహ వ్యాధి తగ్గించుకొనే సూచనలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ధన్వంతరి జయంతి ను స్థానిక బాపు మ్యూజియం లో అందరూ కలిసి ఆరోగ్య సంకల్పం కలగాలని ధన్వంతరి పూజ చేసారు. ఈ కార్యక్రమంలో చంద్ర కుమార్, అడిషనల్ కమీషనర్, చంద్ర శేఖర్ ఆజాద్, జాయింట్ కమీషనర్, వి.సత్యనారాయణ, అసిస్టెంట్ కమీషనర్, విజయవాడ, డిప్యూటీ కమీషనర్లు రానా ప్రతాప్, రత్న రాజు, ఆర్చెయోలజీ డైరెక్టర్స్, ధర్మ పథం దేవాదాయ సమన్వయ కర్త, ధర్మ పధం సలహాదారు డాక్టర్ మానిక్యేశ్వర రావు ఈ పుస్తక రచయిత్రి డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News