– నీట్ విద్యార్థుల బలన్మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
– నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి
-గౌరవ సుప్రీంకోర్టు సిజేఐ పర్యవేక్షణలో మాత్రమే సిబిఐ దర్యాప్తు చేపట్టాలి
-ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ స్థాయిలో పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడంతో నీట్-యూజీ 2026 పరీక్షను రద్దు చేయడం విషాదకరమైన పరిణామాలకు దారితీసింది. తమ విద్యా భవిష్యత్తు ఛిన్నాభిన్నం కావడంతో తీవ్రమైన మానసిక క్షోభ, నిరాశకు లోనైన యువ వైద్య విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రదీప్ మేఘ్వాల్ (రాజస్థాన్): సికార్‌కు చెందిన 22 ఏళ్ల ఈ అభ్యర్థి, పరీక్ష కోసం సంవత్సరాల తరబడి కృషి చేసి 650 మార్కులు సాధిస్తాననే పూర్తి విశ్వాసంతో ఉన్న అతను పరీక్ష ఆకస్మికంగా రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
అన్షిక పాండే (ఢిల్లీ): ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో నివసిస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు కావడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని..
రితిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ యువకుడు మూడోసారి నీట్ పరీక్షకు ప్రయత్నిస్తుండగా, పరీక్ష రద్దు కావడంతో కుంగిపోయాడు.
గోవాలోని కర్టోరిమ్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి రద్దు ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రారంభంలో 22 లక్షలకు పైగా అభ్యర్థులను ప్రభావితం చేసిన ఈ పరీక్షను ఆకస్మికంగా రద్దు చేయడం, దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించడంతో పాటు విద్యార్థి, రాజకీయ వర్గాలచే విస్తృత నిరసనలకు దారితీసింది.
దేశవ్యాప్తంగా ఇంతమంది భావి భారత డాక్టర్లు పేపర్ లీక్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ స్పందించకపోవడం దుర్మార్గమని ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ అన్నారు.
Prajavartha Online Telugu News