విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
18 మే 2026న Ratan Tata Innovation Hub (RTIH) విజయవాడ, ఎనికేపాడు కార్యాలయంలో NTR District Administration మరియు NTR District MSME Department సహకారంతో “మహిళా పారిశ్రామికవేత్తలు & స్టార్టప్‌ల సాధికారత” అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది SHG మహిళా పారిశ్రామికవేత్తలు, MSME సభ్యులు మరియు స్టార్టప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
RTIH సీఈఓ శ్రీ జి. కృష్ణన్ గారు RTIH ద్వారా నిర్వహిస్తున్న స్టార్టప్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు MSME అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి “One Family – One Entrepreneur” విజన్‌ను వివరిస్తూ, మహిళలు మరియు యువత వ్యాపార అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
Walmart ప్రతినిధులు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పిస్తూ, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఈ-కామర్స్ వ్యాపార అవకాశాల గురించి వివరించారు.
కార్యక్రమంలో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్ సభ్యులకు Udyam Registrations, Walmart LMS (Learning Management System) Registrations, Flipkart Seller Registrations మరియు Cross Border Trade Registrations నిర్వహించడం జరిగింది.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నిర్వహించిన రౌండ్ టేబుల్ వన్-టు-వన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో RTIH సీఈఓ ప్రతి మహిళా పారిశ్రామికవేత్త మరియు స్టార్టప్ సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి MSME అభివృద్ధి, మార్కెటింగ్, బ్రాండింగ్, ఇన్నోవేషన్ అవకాశాలు మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలపై మార్గదర్శకాలు అందించారు.
జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి మీనాక్షి గారు మరియు RTIH విజయవాడ ప్రోగ్రామ్ అసోసియేట్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, తమ వ్యాపార మరియు స్టార్టప్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ కార్యక్రమం ద్వారా మంచి అవగాహన లభించిందని తెలిపారు.
Prajavartha Online Telugu News