విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం డిజిల్ పెట్రోల్ సిఎన్జి గ్యాస్ పై పెంచిన ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర నుండి ఏలూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఆటో కి తాడు కట్టి AICC సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు లాగుతూ నిరసన తెలియజేయడం జరిగింది నగర అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, అమిత్ షా దేశంలో తగినంత ఇంధనం నిల్వలు ఉన్నవని ప్రజలు భయపడవలసిన అవసరం లేదని చెప్పి ధరల మేము పెంచము అని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిన మరుసటిరోజే కమర్షియల్ గ్యాస్ మీద 963 రూపాయలు పెంచి ప్రజలను వంచించడం జరిగిందని అలాగే పెట్రోలు డీజిలు సిఎన్జి గ్యాస్ లపై మూడు రూపాలు చొప్పున పెంచి ప్రభుత్వం ప్రజల నుండి డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తుంది ప్రజలకు మంచి పరిపాలన అందించి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ తన అసమర్ధ పాలనతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుతూ ప్రజల్ని ఆర్థికంగా చిదిగిపోయేటట్టు చేస్తున్నారని తక్షణమే నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయాలని అలాగే నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసి లక్షలాదిమంది పరీక్షలు రాసినటువంటి యువకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని కల్పించినటువంటి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ రాష్ట్రంలో వ్యాట్ తీసేసి పెట్రోల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు S A అన్సారీ PCC అడ్మిన్ శివాజీ గారు పీసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ కృషిత ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పీటర్ జోసఫ్ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాసరావు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి ప్రసాద్ విజయవాడ నగర మహిళా అధ్యక్షురాలు సునీత నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకురాలు పశ్చిమ నియోజకవర్గం సత్యవతి ఉమ్మడి కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ కాపు సెల్ అధ్యక్షుడు అల్లం రాజేష్ మరియు పలువురు డివిజన్ అధ్యక్షులు ఆటో కార్మిక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News