విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: స్థానిక కాలేశ్వరరావు రోడ్డు గవర్నర్పేట శ్రీధర్ కాలేజీ దగ్గరలో ఆర్సీసీ బిల్డింగ్ నందు సోమవారం మే 18 న చాట్ అడ్డా షాప్ గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం టిడిపి యువ నాయకులు బోండా సిద్ధార్థ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది మొదటగా బోండా సిద్ధార్థ రిబ్బన్ కట్ చేసి చాట్ అడ్డా షాపును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా మాజీ కార్పొరేటర్ ( ఫ్లోర్ లీడర్ ) నెల్లిబండ్ల బాల విచ్చేయడం జరిగింది. బోండా సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ షాపు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. నూతన పారిశ్రామికవేత్తలకు, చిరు వ్యాపారులకు, కూటమి ప్రభుత్వం తరఫునుంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తరఫునుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నిలిబండ్ల బాల మాట్లాడుతూ షాపు యాజమాన్యం వారు దినదినాభివృద్ధి చెందుతూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి తమ వంతు సహాయంగా కొంతమందికి ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం చాట్ అడ్డా నిర్వాహకులు అయిన మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ తమ వద్ద సుమారు 200 రకాల చాట్ ఐటమ్స్ లభిస్తాయని అన్నారు. తమ వద్ద అందరికీ అందుబాటు ధరలలో చాట్ ఐటమ్స్ లభిస్తాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కేవలం చాట్ ఐటమ్స్ మాత్రమే కాకుండా మిల్క్ షేక్స్, మోహిటోస్, శాండ్విచ్, పిజ్జా, బర్గర్, బాస్కెట్ చాట్, పానీపూరి, ఐటమ్స్ కూడా లభిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజ్వీ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News