విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63వ డివిజన్ రాజీవ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్యత శిబిరం – ఫెర్టిలిటీ అవేర్నెస్ క్యాంప్‌ను సోమవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ:- ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా సంతాన సమస్యలు పెరుగుతున్నాయని, అయితే చాలామంది ప్రజలకు ఫెర్టిలిటీ సమస్యలు, IVF వంటి ఆధునిక చికిత్సలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని…
ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని. మహిళలు మరియు పురుషులకు అవసరమైన వైద్య పరీక్షలు, సమస్యల గుర్తింపు, చికిత్స విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై వైద్య నిపుణులు ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఉచిత కన్సల్టేషన్, స్కానింగ్, వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచడంతో పాటు సరైన చికిత్సపై అవగాహన కలుగుతుందని, ప్రజలు ఇటువంటి హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య సమస్యలపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే వెల్ఫేర్ మరియు హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని, భవిష్యత్తులో సింగ్‌నగర్, ఆర్.ఆర్.పేట, పాయకాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఇటువంటి అవగాహన శిబిరాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, పద్మ, శశి, మాజీ కార్పొరేటర్ పైడితలచి, లబ్బా దుర్గా, డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, డివిజన్ ఇంచార్జ్ మోత్కూరి కాసిం, వైద్య నిపుణులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News