విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లేటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, 42 వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బెన్నా భక్తుల సోమేశ్వరరావు , జనసేన పార్టీ 39 వ డివిజన్ అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, బీజేపీ కొత్తపేట మండల అధ్యక్షులు బైపిళ్ళ చందు ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.
39 వ డివిజన్ కు చెందిన గోర్తి శ్రీనివాస్ (62) కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేయగా మంజూరైన రూ. 1 లక్ష 91 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. 42 వ డివిజన్, హెచ్ బీ కాలనీ కు చెందిన ఉత్తరవల్లి కోటేశ్వరరావు ( 47 ) రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శస్త్ర చికిత్స కొరకు వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 37 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు.
అదేవిధంగా హెర్నియా తో బాధపడుతున్న 52 వ డివిజన్ కు చెందిన పిళ్ళ మధుసూదన్ (49) కు రూ 2 లక్షల 60 వేల ఎల్ ఓ సీ ను, 38 వ డివిజన్ కుమ్మరి పాలెం కు చెందిన షేక్ మాలిన్ ప్రాంక్రియాస్ తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ 2 లక్షల 60 వేల ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. త్వరితగతిన స్పందించి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News