Breaking News

విజయం ఒక ప్రయాణం మాత్రమే నిరంతరం ప్రయాణం కొనసాగించండి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రీయ ఏక్త దివాస్ కార్యక్రమములో భాగంగా K.L యూనివర్సిటీ జాస్మిన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్ ) యు. శారదాదేవి పాల్గొన్నారు. ముందుగా అతిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును ప్రారంభించారు. విద్యార్థులను ఉదేశించి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ యు. శారదాదేవి మాట్లాడుతూ బి.ఏ ఆర్ట్స్ కోర్స్ నందు IAS (UPSC) పోటి పరీక్షలు వ్రాయు విద్యార్ధులకు పోటి పరిక్షలపై అవగాహన మరియు ప్రేరణ కల్పించారు. ప్రతి ఒక్కరు కలలు కనండి, దృష్టి సారించి ఇష్టంతో చదవాలి, మీ మీద మీకు నమ్మకం కలిగి యుండాలి, ఎప్పుడూ ఆశ వదులుకోవద్దు, అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. విజయం ఒక ప్రయాణం మాత్రమే నిరంతరం ప్రయాణం కొనసాగించండి. ప్రతి ఒక్కరు సమాజంలో ఒక మంచి మనిషిగా ఎదగాలని అన్నారు. ఆశావద దృక్పధం కలిగియుండి, మంచి అలవాట్లను పెంపొందించుకోవటం వంటి లక్షణాలు కొనసాగించాలి. నేటి సమాజంలో బ్యూరోక్రాట్స్, రాజకీయ వేత్తలు మరియు వ్యాపారవేత్తలు యొక్క పాత్ర ఎంతో ప్రధానమైనదని, అందులో యువత ముందుకు రావాలని ఆకాంక్షించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆర్ట్స్, KLEF క్రింద ఉన్న అసోసియేషన్ మరియు బ్రాండ్, విద్యార్థి సంఘం విభాగం ద్వారా సామాజిక సమస్యల ఉపశమనానికి, సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి సేవలను విస్తరించే సంఘాలలో KLASS (KL Association for Social Sciences) ఒకటి అని వివరించారు. తదుపరి KLASS లోగో మరియు ప్రజ్ఞాన “e” న్యూస్ లెటర్ ను అతిధులతో కలసి ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమంలో ప్రో. పి.ఉమనంద శర్మ, కె.ఎస్ లక్ష్మణరావు, సి నాగరాజు, కె. ఎస్ వెంకటేశ్వర కుమార్, నరసింహ నరేష్ డైరెక్టర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణపతి మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బొండా సిద్ధార్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ, 60వ డివిజన్లలో సోమవారం నిర్వహించిన గణపతి మహోత్సవాల్లో తెలుగుదేశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *