Breaking News

“విద్య”తోనే పేదరిక నిర్మూలన

-పేద మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్ విద్య
-ప్రతిభావంతులను గుర్తించేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష సక్సెస్
-రాష్ట్రవ్యాప్తంగా 6605 మంది హాజరు
-మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
-నిర్వహణ అధికారులకు మంత్రి అభినందన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతోనే యువత తాము అనుకున్న ఉన్నత స్థాయి లకు ఎదగగలుగుతారని, తద్వారా సమాజాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం కావాలని, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు ద్వారా ఉచిత కార్పోరేట్ ఇంటర్ విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు నిర్వహించిన *తాలీమ్ ఏ హునర్” ప్రవేశ పరీక్ష విజయవంతమైనట్లు సోమవారం అమరావతిలో విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలలో 27 కేంద్రాలలో ప్రవేశ పరీక్షను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్ రెసిడెన్షియల్ విద్య కోసం వక్ఫ్ బోర్డు ద్వారా అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 7392 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు.
అయితే ప్రవేశ పరీక్షకు 6605 మంది హాజరయ్యారని,787 మంది హాజరు కాలేదని,89.35% హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షకు హాజరైన వారిలో బాలికల శాతం ఎక్కువగా ఉన్నారన్నారు.
పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత విద్య అభ్యసించేందుకు బలమైన పునాదులు వేయుటకు ఇంటర్మీడియేట్ విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఇందు కోసం “తాలీమ్ ఏ హునర్” పథకం ద్వారా విద్యార్థులను ఎంపిక చేసేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహణ కు శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
ఈ పథకానికి మైనారిటీ వర్గాలతో పాటు అన్ని వైపుల నుండి ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు, ముఖ్యమంత్రికి ప్రశంసల వెల్లువలు వచ్చాయన్నారు.
“తాలీమ్ ఏ హునర్ “పరీక్ష సజావుగా నిర్వహించినందుకు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మైనారిటీ శాఖ అధికారులు, సిబ్బందికి, ఇతర సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందికి, విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయులకు మంత్రి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *