విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుణదల పడవల రేవతి సెంటర్ వద్ద పాత ధోభీకానా వద్ద ₹16 లక్షల రూపాయలతో నూతన ధోభీకానా నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు రజక సంఘం సోదర సోదరీమణులతో కలిసి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బీసీ, కులవృత్తుల కుటుంబాలకు మళ్లీ అండగా నిలబడటమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 21 నెలల్లోనే తాను శాసన సభ్యులుగా సెంట్రల్ నియోజకవర్గంలో ₹340 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తు ఒక పక్కన అభివృద్ధిని ప్రజలకు సంక్షేమాన్ని అందజేస్తున్నామని, ముఖ్యంగా రజక సోదరుల సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి ధోబీఘాట్లు, ధోభీకానాల మరమ్మతులు, ట్యాంకులు, పైపులైన్‌లు, షెడ్లు, ఫ్లోరింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేస్తున్నామని, గుణదల ప్రాంతంలోని ధోభీకానా అభివృద్ధికి ₹16 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, అదనపు అవసరాల కోసం మరిన్ని అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామని, మాకు అధికారం అంటే అహంకారం కాదు, ప్రజల పట్ల బాధ్యత అని, ప్రతి డివిజన్‌లో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో పని చేస్తూ బీసీ, SC, ST, మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు, త్వరలోనే “ఆదరణ” పథకాన్ని మళ్లీ ప్రారంభించి కులవృత్తులు చేసుకునే వారికి అవసరమైన సామగ్రి అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు పెసర్లంక వీరభద్రం, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, నైనవరపు వీరయ్య, సత్తెనపల్లి శ్రీనివాసరావు 1వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కమ్మినేని సురేష్, పరుచూరి భార్గవ్, దివ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News