Breaking News

ఘనంగా నెట్టెం రఘురాం జన్మదినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఛైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినోత్సవం సందర్భంగా, కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సొసైటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ, తిరువూరు, ఉయ్యూరు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
జగ్గయ్యపేటలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తో కలిసి నెట్టెం రఘురాం స్వయంగా పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు.
అనంతరం నెట్టెం రఘురాం స్వగృహంలో జరిగిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారితో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, తెలుగు దేశం పార్టీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యకర్తలు, కేడీసీసీ బ్యాంకు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న నెట్టెం రఘురాం మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *