గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీద్ రోజున అనధికార జంతు వధ జరగరాదని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. జంతు వధ నిషేధిత చట్టం కింద గో వధ నిషేధం మరియు జంతు వధ నివారణ చట్టం, 1977 క్రింద బక్రీద్ రోజున గో వధ, ఇతర అనధికార జంతువుల వధపై బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధీకృత స్థలంలో మినహా బయట ఎక్కడ జంతు వధ జరగరాదని చెప్పారు. గోవులను వధించరాదని, అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీ రాజ్, పశు సంవర్ధక శాఖ, ఇతర అనుబంధ శాఖలు బృందాలుగా ఏర్పడి పటిష్టమైన పర్యవేక్షణ, నిఘా, అమలు చూడాలని ఆదేశించారు. అక్రమ రవాణా, అనధికార జంతు వధ జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఎద్దులను కూడా వధించరాదని అన్నారు. దేనికి ఉపయోగపడదని అధికారికంగా ధృవీకరించిన తరువాత మాత్రమే వధించుటకు అవకాశం ఉందని చెప్పారు. గర్భం దాల్చిన ఏ జంతువును వధించరాదని పేర్కొన్నారు. ఒంటె లను కూడా వధించరాదని చెప్పారు. పోలీస్ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని, స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అధీకృత జంతు వధ శాలలను గుర్తించాలని, తాత్కాలిక జంతు వధ శాలలకు దరఖాస్తు చేసిన వారికి నిబంధనలు మేరకు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. డివిజనల్ స్థాయి కమిటీలు జంతు వధ శాలలకు సంబంధించి సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. జంతు రవాణాను పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
అనధికార జంతు వధపై సమాచారం అందించాలి
అనధికార జంతు వధ, జంతు వధ శాలల నిర్వహణ, అక్రమ రవాణా తదితర సమాచారం క్రింద తెలిపిన ఫోన్ నంబర్లకు అందించాలని కోరారు.
1. సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ – 8688831391.
2. పశు సంవర్ధక శాఖ – 83330 86999.
3. గుంటూరు మునిసిపాల్ కార్పోరేషన్ – 9849908363.
4. పొన్నూరు మునిసిపాలిటి – 9849905834.
5. తెనాలి మునిసిపాలిటి – 9849905830.
6. ఎం.టి.ఏం.సి – 7093320018.
7. తెనాలి సబ్-కలెక్టర్ – 9849904008.
8. రెవిన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006.
9. జిల్లా పంచాయతి అధికారి – 9492758041.
Prajavartha Online Telugu News