-విశాఖ రైల్వే జోన్ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఆంధ్రుడూ ముందుకు రావాలి!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపి కూటమి రాజకీయ పార్టీలు విశాఖ రైల్వే జోన్ అంశంలో ఎందుకు లైన్ తప్పుతున్నాయి? యు టర్న్ ఎందుకు తీసుకుంటున్నారు? అని రాష్ట్ర అధ్యక్షులు, AP ప్రజా సంఘాల JAC జెటి రామారావు అని ప్రశ్నించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రత్యేక హోదాకు ఉరి వేసిన శక్తులే నేడు విశాఖ రైల్వే జోన్ పాలిట శాపంగా మారిందన్నారు. ఒడిషాతో సాప్ట్ కార్నర్ ఎందుకు !? నాగావళి, వంశధార, పోలవరం, కొటియా గ్రామాలు, సరహద్దు ప్రాంతాలలో ప్రతిరోజూ తగవులు, పైగా ఎపిపై సుప్రీం కోర్టు లో లెక్కలేనన్ని కేసులు.? కె కె లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ పేరుకే జోన్.. గెజిట్ నోటిఫికేషన్ లో మార్పులు, చేర్పులు చెయ్యాలన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కేంద్రం చేస్తున్న మోసం! డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ గేమ్ అడడం సిగ్గు చేటన్నారు. నిరుద్యోగుల అకలి కేకలు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కు వినపడేలా కంచాలు, గరిటెలతో నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. ఉద్యోగ నియామకాలలో నెగిటివ్ మార్కలు తీసేయ్యాలి, పది సంవత్సరాలు అలస్యంగా రైల్వే జోన్ ప్రకటించారు కాబట్టి 1990 తర్వాత పుట్టిన వారందరకీ అవకాశాలు కల్పించాలన్నారు. కేవలం విభజన బిల్లులో ఉంది, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తుందనే తూతూ మంత్రంగా రైల్వే జోన్ ప్రకటన. విశాఖ డిఅర్ యమ్ కార్యాలయంలో ఇ-టెండర్, ఇ-అక్షన్, ఇ-పేమెంటు ల పేరుతో ఖజానా ఖాళీ, కోట్లాది రూపాయల దారి మళ్లింపులు అపాలి. వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర రైల్వే మంత్రికి పంపాలి… లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామన్నారు. తెలుగు వారికి, విశాఖ వచ్చేవారికి వెంటనే NOC లు ఇవ్వాలి, ఇక్కడ ఉన్న బీహార్, బెంగాల్, ఒడిషా వారిని బయటకు పంపాలి. త్వరలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరతాం, రాష్ట్ర గవర్నర్ ను కలుస్తామన్నారు. ఈ సమావేశంలో JAC, నిరుద్యోగ సంఘాల నేతలు కె సుబ్రహ్మణ్యం, CH.దుర్గ, Y మంజునాధ్, కె నిషాంత్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News