-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి…
-నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం…
-వ్యవసాయాధికారి ఆంజనేయులు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు.
బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తాను పండించే పంటకు సంబందించి ఈ – క్రాప్ లో నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. తుఫానులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బతిన్నపుడు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు క్రాఫ్ ఇన్సూరెన్, ఇన్ పుట్ సబ్సిడి వంటి పరిహారం అందించడం జరుగుతుందన్నారు. రైతు స్పందన ద్వారా రైతుల సమస్యల పై వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ రోజు పియం కిసాన్ అందలేంటూ మూడు అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలు మేరకు నెలలో ప్రతి మొదటి, మూడవ బుధవారం రైతు స్పందనా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. భూమిని సారవంతం చేసేందుకు 50 శాతం సబ్సిడిపై గుడివాడ రూరల్ మండలంలో జీలుగు, పిల్లిపెసర, జనుము విత్తనాలు అంజదిస్తున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలంలో రైతు భరోసా మూడో ఏడాది రెండవ విడతగా 3753 రైతు కుటుంబాలకు రూ.79 లక్షలు ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమచేసామన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వారి గ్రామాల్లోనే ఉన్న ఆర్బీకేల ద్వారా అందిస్తున్నామన్నారు.
అర్జీలు :- గుడివాడ రూరల్ మండలం శేరివేల్పూరు, మందపాడు, దొండపాడు గ్రామాలకు చెందిన రైతులు సూరపనేని రామగోపాల్, దారపురెడ్డి గణేష్ పవన్ కుమార్, చోరగుడి కాంతారావులు తమకు పియం కిసాన్ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సహాయం ఖాతాల్లో జమకాలేదని జమచేయవలసిందిగా అర్జీల్లో కోరారు.
రైతు స్పందనా కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ వైద్యులు హనుమంతరావు, ఇరిగేషన్ ఏఇ ఆర్ అమరేశ్వరరావు, మత్స్యశాఖ ఎఫ్ డీవో శైలజ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News