విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 3వ డివిజన్, కరెన్సీ నగర్ నందు దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హల్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరుగగా ఆ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ డివిజన్ లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో, దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా అభివృద్ధి చేసారని మరలా నేడు వారి తనయులుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో నియోజకవర్గన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలపడానికి కృషి చేస్తానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే, కార్పొరేటర్ లు ఉండి కూడా డివిజన్ ను నిర్లక్ష్యం చేసారని ఈ కాలనీ పెద్దలే చెబుతున్నారు అని, నేడు వారు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు, వైసీపీ నాయుకులు ఆళ్ల చల్లారావు, కొరివి చైతన్య (వర), భీమిశెట్టి బాబు, కరెన్సీ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నాంచారయ్య, బాపూజీ, చలపతిరావు, భార్గవ్, కేబుల్ రవి, శ్రీనివాస్, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News