Breaking News

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారునికి ఈ -ఆటోను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారునికి గురువారం స్థానిక కలెక్టరేట్ నందు మెప్మా వారి ఆధ్వర్యంలో సురేంద్ర అను లబ్ధిదారునికి ఈ -ఆటోను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మార్చి 30న నాయుడుపేటలో నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీ మేరకు, మెప్మా ఆధ్వర్యంలో నాయుడుపేటకు చెందిన లబ్ధిదారుడు అయిన సురేంద్రకు రూ.3.52 లక్షల విలువ గల ఈ -ఆటోను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఇంటికొక్క పారిశ్రామిక వేత్త లో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాల ద్వారా పట్టణ పేదలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

ఈ -ఆటోను అందుకున్న సురేంద్ర ముఖ్యమంత్రి కు మరియు జిల్లా కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆటో ద్వారా తన కుటుంబానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డిఓ దేవేందర్ రెడ్డి, మెప్మా పీడీ జాల ఎఫ్రాయిమ్, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజిలుల్లా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *