విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), విజయవాడ – ఎనికేపాడు సహకారంతో, యూనియన్ బ్యాంక్ RSETI ఆధ్వర్యంలో ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జనరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (EDP) – మహిళా సాధికారత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో మొత్తం 35 మంది గ్రామీణ మహిళలు పాల్గొన్నారు. వారిలో 32 మంది మహిళా వ్యాపార కార్యకలాపాల కోసం MSME యూనిట్లు అధికారికంగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పొందాయి, ఇది గ్రామీణ మహిళా పారిశ్రామికాభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.
కార్యక్రమంలో RTIH సీఈఓ జి. కృష్ణన్ RTIH కార్యక్రమాలు మరియు ముఖ్యమంత్రి “ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు” లక్ష్యాన్ని వివరించారు. అలాగే కొత్త వ్యాపార ఆలోచనల రూపకల్పన, బిజినెస్ ప్లాన్ తయారీ, వ్యాపార స్థాపన, MSME అవగాహన మరియు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంశాలపై మార్గదర్శకత్వం అందించారు.
ఈ కార్యక్రమం ఇంటరాక్టివ్ బిజినెస్ వర్క్‌షాప్‌గా విజయవంతంగా నిర్వహించబడింది. మహిళలు చురుకుగా పాల్గొని వ్యాపార స్థాపనకు సంబంధించిన సందేహ నివృత్తి, అక్కడికక్కడే వ్యాపార సృష్టి అవకాశాలు మరియు పారిశ్రామిక మార్గదర్శకత్వం పొందారు.
RTIH సీఈఓ జి. కృష్ణన్ నిర్వహించిన సెషన్ మహిళలను ఎంతో ప్రేరేపించి, తమ ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చుకునేందుకు ఉత్సాహాన్ని కలిగించింది.
ఈ కార్యక్రమంలో RSETI డైరెక్టర్ అమరేశ్వర రెడ్డి, యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్, మరియు RTIH ప్రోగ్రామ్ అసోసియేట్స్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ మహిళలు వ్యాపార అవకాశాన్ని కల్పించినందుకు మరియు వెంచర్ క్రియేషన్ (Venture Creation) కోసం నిరంతర హ్యాండ్‌హోల్డింగ్ సపోర్ట్ సిస్టమ్ అందిస్తున్నందుకు RTIH కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం మహిళా సాధికారత మరియు గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతూ విజయవంతంగా ముగిసింది.
Prajavartha Online Telugu News