అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బక్రీద్(Eid-ul-Adha)సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28వ తేది గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిఓఆర్టీ సంఖ్య:1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.బక్రీద్ పర్వదిన్నాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం గతంలో ఈనెల 27వ తేది బుధవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.అయితే నెలవంక(Sighting of the moon)ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈనెల 27కు బదులుగా 28 గురువారం నిర్వహించుకోనునన్నారని విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు బక్రీద్ సాధారణ సెలవును ఈనెల 27కు బదులు 28వ తేదీ గురువారానికి మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సిఎస్ ఈఉత్తర్వులు జారీ చేశారు.కావున ఈనెల 27వతేది బుధవారం సెలవును 28వతేది గురువారానికి మార్చడంతో 27వతేది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యదావిధిగా పని చేస్తాయని సిఎస్ సాయి ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే విధంగా షాపులు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881 కు అనుగుణంగా బక్రీద్ సాధారణ సెలవును ఈనెల 27వ తేది బుధవారానికి బదులుగా 28వ తేది గురువారానికి మార్పు చేస్తూ జిఓఆర్టి సంఖ్య:1007 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags amaravathi
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News