Breaking News

ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందని పేర్కొన్నారు.

అలాగే శుక్రవారం(22-05-2026) 15 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/eab7b45263c07735612ba193f39b3834.pdf

రాబోవు రెండు రోజులు క్రింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉన్నట్లు ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు

☀️ మే 22 శుక్రవారం

• అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• కాకినాడ,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

☀️ మే 23 శనివారం

• పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• కాకినాడ,నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

• శ్రీకాకాళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

గురువారం పల్నాడు(జి) పిడుగురాళ్లలో 48.1డిగ్రీలు, బాపట్ల(జి) వేటపాలెం, కృష్ణా(జి) నందివాడ 47.6, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడు, ప్రకాశం(జి) అద్దంకిలో 47.4, ఏలూరు(జి) అల్లిపల్లిలో 47.3, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 46.6, పోలవరం(జి) కూనవరంలో 46.5, నెల్లూరు(జి) కావలిలో 46.4, గుంటూరు(జి) తెనాలిలో 46, తూర్పుగోదావరి(జి) బ్రహ్మణగూడెంలో 45.8, పశ్చిమగోదావరి(జి) తాడేపల్లిలో 45.5, విశాఖ(జి) ములగాడలో 45.2, అనకాపల్లి(జి) మాకవరపాలెం, కోనసీమ(జి) రామచంద్రాపురం, తిరుపతి(జి) బోనుపల్లెలో 45.1, కాకినాడ(జి) కందరాడ, విజయనగరం(జి) గుర్లలో 45 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, పోలవరం, నెల్లూరు రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *