Breaking News

ప్రజల భద్రత ప్రధాన లక్ష్యం, ఔట్ ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయండి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంమని కావున ఔట్ ఫాల్ డ్రైన్స్ వద్ద రీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామల దేవి రోడ్డు, భగత్ సింగ్ నగర్ రోడ్డు, వాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు.

అజిత్ సింగ్ నగర్ వద్ద ఉన్న ఔట్ ఫాల్ డ్రైన్ కు రైలింగ్స్ వేసి, బ్యారిగేటింగ్ సరిగ్గా చేయించాలని, నగరంలో ఇప్పటికే ప్రతి ఔట్ ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ, మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జే ఎన్ ఎన్ యు ఆర్ ఏం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని, ప్రతి రోజు సైడ్ కాలువలు తీయాలని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, క్రమ తప్పకుండా యాంటీ మలేరియాల్ యాక్టివిటీస్ జరగాలని శాఖాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. తదుపరి సింగ్ నగర్లో గల అన్న క్యాంటీన్ పరిశీలించి నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు పరిశీలిస్తూ ఎటువంటి మరమతులున్న వెంటనే పూర్తి చేయాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కూలర్లు, పరదాలు నీటి సరఫరా ఎప్పటికప్పుడు సరిగా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలని అన్నారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *