Breaking News

డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్మీడియట్ మరియు ఐ‌ఐటిశ నీట్ ఫేజ్-I మరియు ఫేజ్-II కేటాయింపుల అనంతరం మిగిలిన ఖాళీల భర్తీకి అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించబడనున్నది.
ప్రవేశ పరీక్ష రాసి సీట్లు పొందని విద్యార్థినీ, విద్యార్థులు ( కేవలం మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులయిన మరియు మొబైల్ కు సమాచారం అందించిన వారు మాత్రమే ) కోసం 5వ తరగతి బాలికలకు ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల గురుకుల పాఠశాలలో తేదీ 26.05.2026 న మరియు జూనియర్ ఇంటర్మీడియట్‌కు మరియు ఐ‌ఐటి నీట్ తేదీ 29.05.2026 కౌన్సెలింగ్ నిర్వహించబడును. అలాగే బాలురకు 5వ తరగతి తేదీ 27.05.2026 న మరియు జూనియర్ ఇంటర్మీడియట్‌కు తేదీ 30.05.2026 న ఎన్టీఆర్ జిల్లా కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించబడును.
ప్రవేశ పరీక్ష రాసిన కేవలం మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులయిన మరియు మొబైల్ కు సమాచారం అందించిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అర్హులు అని గమనించగలరు. మరియు అర్హుల జాబితా ఆయా గురుకుల పాఠశాలలో మరియు విజయవాడ జిల్లా ఆఫీస్ నోటీసు బోర్డు లో ఉంచడం జరిగింది.
ఫేజ్-I మరియు ఫేజ్-II లలో సీట్లు పొంది కన్ఫర్మేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావలసిన అవసరం లేదు.
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు తమతో పాటు ఆధార్ కార్డు, ప్రవేశ పరీక్ష మార్కుల జాబితా మరియు అలాట్‌మెంట్ లెటర్, SSC మార్కుల మెమో, కుల ధృవీకరణ పత్రం నకలు తీసుకురావలెను.
ఉన్న ఖాళీలను బట్టి 1:2 విద్యార్థులను పిలవడం జరిగింది కాబట్టి హాజరయిన వారందరికీ సీట్లు గారంటీ లేదు . అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా సమన్వయ అధికారి ఎ. మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *