Breaking News

చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి…

-తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి సమైక్యంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ ఏడాది దీపావళి తెలుగు ప్రజల కుటుంబాల్లో ఆనందాల సిరులు కురిపించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. టపాసులు కాల్చే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రజలకు భరోసాగా నిలవాలి

-పరిష్కరించిన ఫిర్యాదు తిరిగి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి -సత్వర, నాణ్యమైన పరిష్కారమే ప్రజల సంతృప్తికి కొలమానం -ఫిర్యాదుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *