Breaking News

కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ యూనియన్ విజయవాడ రీజనల్ నూతన కార్యవర్గం

-కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ విజయవాడ రీజనల్ యూనియన్‌కు ‘నూతన’ సారథులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంక్ గోల్డ్ లోన్ అప్రైజర్ల సమస్యల పరిష్కారానికి బ్యాంకులు కృషి చేయాలని కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏపీ జనరల్ సెక్రెటరీ ఈదరాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ భవానిపురం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ విజయవాడ రీజనల్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశానికి అధ్యక్షత వహించిన ఏపీ జనరల్ సెక్రెటరీ ఈదరాడ శ్రీనివాస్ అధ్యక్షులగా మారెళ్ళ రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ లక్కోజు సాయిరాజ్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ షేక్ మస్తాన్ భాష,ట్రెజరర్ నరేంద్ర కుమార్, ఏడుకొండలు, రీజనల్ కమిటీ సభ్యులు, కొవ్వాడ నాని, బాలాజీ, సుధాకర్, రామచంద్రరావు, నమఃశివాయ, సంతోష్కుమార్, తిరుమలరెడ్డి, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకట్రావు ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కెనరా బ్యాంక్ విజయవాడ రీజనల్ ఆఫీసు ఇంచార్జ్ డీజీఎం పి బాలసుబ్రమణ్యం, సిబి ఈ యు సెక్రెటరీ సంజయ్ కుమార్, సి బి డబ్ల్యు ఈ యు నాయకులు బాబు హాజరై ఎన్నికైన నూతన కార్యవర్గానికి యూనియన్ గుర్తింపు కార్డులు అందజేసి, సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కెనరా బ్యాంక్ గోల్డ్ లోన్స్ రెండు లక్షల 50 వేల కోట్లు మైలురాయిని దాటిందని, మేనేజర్స్ అప్రైజర్స్ సమన్వయంతో పనిచేసి గోల్డ్ లోన్లు ఇంకా పెంచాలని, బ్యాంకు తరపు నుండి అప్రైజర్స్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
అప్రైజర్స్ యూనియన్ నాయకులు ఈదరాడ శ్రీనివాస్ మాట్లాడుతూ 2013లో విశాఖపట్నంలో ప్రారంభమైన మా యూనియన్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగిందని నోట్ల రద్దు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి బ్యాంకుకు సేవలందించిన అప్రైజర్కు కనీస జాబు సెక్యూరిటీ గుర్తింపు కార్డు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. మా ప్రధాన డిమాండ్లు 1) అప్రైజర్స్ కు వెంటనే బ్యాంకు గుర్తింపు కార్డులు అందజేయాలి. 2) జాబ్ సెక్యూరిటీ కల్పించాలి. 3) ప్రమాద బీమా, మెడికల్ సౌకర్యాలు అమలు చేయడం. 4) ఆర్.బి.ఐ కొత్త ఆంక్షలు నైపద్యంలో వర్కు లోడు తగ్గించి తగిన ఇన్సెంటివ్ ఇవ్వాలని, 5) అప్రైజర్స్ తో క్లరికల్ పనులు చేయడం నిలిపివేయాలని బ్యాంకును కోరుతున్నామన్నారు. యూనియన్ తరపున కరోనా బారిన పడిన అప్రైజర్స్ కుటుంబాలకు యూనియన్ ఆర్థిక సహాయం అందించిందని, విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ లాంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ విజయవాడ రీజనల్ ఆఫీసు ఇంచార్జ్ డీజీఎం పి బాలసుబ్రమణ్యం, సిబి ఈ యు సెక్రెటరీ సంజయ్ కుమార్, సి బి డబ్ల్యు ఈ యు నాయకులు బాబు, బ్యాంకు అప్రైజర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *