దివ్యాంగుల కోటాలో రైతుబజార్లో స్టాల్ ను కేటాయించండి…

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల కోటాలో గుడివాడ రైతుబజార్లో స్టాలు కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం పాత రామాపురానికి చెందిన నత్తా మధు కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గుడివాడ రైతుబజార్లో స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. స్టాల్ కేటాయించి ఉపాధి కల్పించాలని మధు కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ స్టాల్స్ కేటాయింపు విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్తో మాట్లాడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“కంపెనీ Specific డ్రైవ్”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *