Breaking News

సెకండరీ ప్రభుత్వాసుపత్రుల్లో సంక్లిష్ట శస్త్రచికిత్సల పరంపర

-రిఫరల్స్ తగ్గించి సదరు ఆసుపత్రుల్లోనే రోగుల ఆరోగ్యానికి వైద్యుల భరోసా
-వైద్యులు, నర్సుల ఉత్తమ వైద్య సేవలు
-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు
-32 వైద్య బృందాలకు ప్రశంసా లేఖలు పంపిన డి.ఎస్.హెచ్ కేవీఎన్ చక్రధరబాబు
-ఆసుపత్రుల ఆపరేషన్ థియేటర్లలో సమకూరుతున్న ఆధునిక సదుపాయాలు
-ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సెకండరీ ఆసుపత్రుల్లో క్లిష్టమైన శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సాధ్యమైనంత వరకు కేసులను రిఫర్ చేయకుండా కష్టతరమైన శస్త్రచికిత్సలను సైతం వైద్యులు సెకండరీ ఆసుపత్రుల్లో చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 31 నుంచి ఇటీవల వరకు జరిగిన వాటిలో 32 సంక్లిష్ట శస్త్ర చికిత్సలు ఉన్నట్లు నిశిత పరిశీలన అనంతరం డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ ప్రధాన కార్యాలయం గుర్తించింది. అలాగే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో 18 ఆసుపత్రులు ఉత్తమ పనితీరు కనబరిచినట్లు వెల్లడయింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధరబాబు మొత్తం 50 వరకు అభినందన లేఖలు పంపారు. గిరిజన ప్రాంతంలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో టోటల్ నీ రీప్లెస్మెంటు జరిగింది. చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో రెక్టల్ ప్రొలాప్స్, భారీ పైబ్రాయిడ్ హిస్టరెక్టమీ శస్త్రచికిత్సలను అక్కడ వైద్యులు విజయవంతంగా ముగించారు. ఇలా ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని, సహచరులు కూడా ఇదేవిధంగా స్పందిస్తే రోగుల ఆరోగ్యానికి భరోసా మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఏరియా ఆసుపత్రుల్లో సైతం..

టీచింగ్ ఆసుపత్రుల్లో మాదిరిగా DSH ఆసుపత్రులో ఆధునిక సౌకర్యాలు, ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాల్టీ వైద్యులు పూర్తి స్థాయిలో ఉండరు. అయినప్పటికీ DSH వైద్యుల్లో కొందరు వృత్తిపట్ల నిబద్ధతను పాటిస్తూ పెద్దాసుపత్రులకు కేసులు రిఫర్ చేయకుండా స్థానికంగానే పరిమిత సౌకర్యాల మధ్య శస్త్రచికిత్సలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారని డీఎస్ హెచ్ కేవీఎన్ చక్రధరబాబు నేడొక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల రోగులకు వ్యయప్రయసాలు తగ్గుతున్నాయని, వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని, విలువైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే అనారోగ్యం నుంచి త్వరగా కోరుకుంటున్నారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతను పాటించే వారిని తగిన ప్రమాణాలతో గుర్తించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అనుసరించి ఎప్పటికప్పుడు అభినందన లేఖలు పంపుతున్నామని వివరించారు.

తొలి కాన్పు సిజేరియన్-రెండో కాన్పు సహజ ప్రసవం!

అన్నమయ్య జిల్లా రాజంపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు కూడా సిజేరియన్ ద్వారా జరగాల్సిన ప్రసవాన్ని సహజ విధానంలో జరిగేలా చేశారు. ఓ మహిళకు తొలి కాన్పు సిజేరియన్ విధానంలో జరిగింది. రెండో కాన్పు కోసం ఇక్కడికి రాగా.. సహజ విధానంలో జరిగేలా వైద్యులు, నర్సులు కృషిచేశారు.

స్కిన్ ట్రాన్స్ ప్లాంట్

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఆసుపత్రిలో చేరిన సదరు రోగి శరీరం పై ఉన్న చర్మంలో 26% ఒకచోట తొలగించి, మరోచోట ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఇదే ఆసుపత్రిలో అరుదైన హెర్నియా రీపేర్స్ (స్పైజిలియన్, ఆభూరేటర్, సయాటిక్), సర్జరీ జరిగింది.

16 నెలలు 511 క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు

ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో కంటి వైద్యులు 16 నెలల్లో 511 క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేశారు.

రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో “నీ రీప్లేస్మెంట్ ”

*గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలోని ఏరియా ఆసుప్రతిలో ఒకరికి ” నీ రీప్లేస్మెంట్ ” జరిగింది టీచింగ్ ఆసుపత్రుల్లో జరగాల్సిన ఈ తరహా సర్జరీలు గిరిజన ప్రాంతంలో జరగడం గమనార్హం.

“చింతపల్లి ఏరియా ఆసుపత్రి (గిరిజన ప్రాంతం) లో ఒకరికి రెక్టల్ ప్రొలాప్స్ (మలద్వారం నుంచి పేగు బయటకు రావడం) సర్జరీ జరిగింది. ఇదే ఆసుపత్రిలో భారీ ఫైబ్రాయిడ్ సమస్య (గర్భాశయంవద్ద పెద్ద కణితి)తో బాధపడుతున్న మరో రోగికి హిస్టరెక్టమీ చేశారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో నూ ఇటువంటి శస్త్ర చికిత్స జరిగింది.

సహజ ప్రసవం ద్వారా 4.8 కిలోల శిశువు జననం

*అనకాపల్లి జిల్లా అసుపత్రిలో 4.8 కిలోల శిశువు జననం సహజ ప్రసవం ద్వారా జరిగింది.

*అరకు ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ కడుపు నుంచి 9 కిలోల కణితిని తొలగించారు.

*తెనాలి జిల్లా ఆసుపత్రిలో ఆర్థో వైద్యులు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడిన ఇద్దరు మహిళలకు వేసంక్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహించి, వారి ప్రాణాలు కాపాడారు.

జాతీయ కార్యక్రమాల అమల్లో….

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన అభా, ఎన్క్వాస్, ఎన్బీఎసీయూ, ఎస్ఎన్సీయూ, ఎన్సీడీ, ఇతర కార్యక్రమాల అమల్లో 18 ఆసుపత్రులు ఉత్తమ ప్రతిభకనబరిచాయి.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహించే ధర్మవరంలోని ఏరియా,
పార్వతీపురం జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆదోని, అనపర్తి ఏరియా ఆసుపత్రి, పెద్దాపురం సీహెచ్సి, అనకాపల్లి జిల్లా ఆసుపత్రి, ఇతర ఆసపత్రులు ఉత్తమ పనితీరు కనబరిచినట్లు డీఎస్ఎహెచ్ చక్రధరబాబు తెలిపారు.

నలుగురికి లాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీలు

-ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో గడిచిన 10 రోజుల్లో కాలంలో నాలుగు లాప్రోస్కోపిక్ సర్జరీలు జరిగాయి. కడుపు నొప్పితో బాధపడే వారిలో అవసరమైన వారికి అత్యాధునిక సౌకర్యాల మధ్య కుట్లు లేని ఈ సర్జరీలు జరుగుతుండడంతో రోగులు త్వరగా కోలుకుంటున్నారు. రూ. 37 లక్షలతో ఆత్యాధునిక లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులోనికి వచ్చింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *