Breaking News

నగర పాలక సంస్థ వార్డుల పునర్విభజన పై 134 అభ్యంతరాల వినతులు… : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65, సిడిఎంఏ వారి ఉత్తర్వులు తేదీ.1-04-2026 ఆర్ఓసి నం.13032/2/2026/H1-1 మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 57 ఎన్నికల వార్డులను 76 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ఈ నెల 18న ప్రతిపాదిత ముసాయిదా ప్రచురించుట జరిగిందని, వార్డుల పునర్విభజన అభ్యంతరాల పై ఈ నెల 24, అనగా నేటి సాయంత్రం 5 గంటలతో ముగిసిందని, నగర పాలక సంస్థకు 134 అభ్యంతరాలు అందాయని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థ నందు ఎలక్షన్ వార్డుల పునర్విభజన సందర్భముగా ఫారం 1 నందు 76 వార్డులకు సంబంధించిన వివరములను ప్రకటించి అభ్యంతరములు స్వీకరించుటకు 24 మే చివరి తేదీగా నిర్ణయించిన విషయము విదితమే. సదరు వార్డుల పునర్విభజనకు సంబంధించి మే 24 తేదీ వరకు నగర పాలక సంస్థ నందు 132 నేరుగా మరియు ఆన్ లైన్ ద్వారా 2 అభ్యంతరాలు, మొత్తం 134 అభ్యంతరాలను వివిధ వార్డుల నుండి ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరియు రాజకీయ పార్టీల నుండి అభ్యంతరాలకు సంబంధించిన వినతులు అందాయని తెలిపారు. వాటిని సమగ్రముగా పరిశీలించి నిబంధనల మేరకు ప్రకటించిన వార్డులకు సవరణలు చేసి, సవివరాలతో పూర్తి స్తాయి తుది నివేదికను తయారు చేసి జూన్ 8 2026 లోపు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదమునకు పంపబడునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *