Breaking News

ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మే 23, 2026 నుండి జూన్ 20, 2026 వరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారని, ప్రజల భాగస్వామ్యంతో నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం, పారిశుద్ధ్య కార్మికులపై భారం తగ్గించడం మరియు శుభ్రమైన నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు అన్నారు.

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం ఆదేశాల మేరకు నగరంలోని 64 డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం భవానీపురం, విద్యార్థరపురం ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాలలో ప్రజలతో కలిసి శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ముందుకు రావడం ఆనందదాయకం మని, ప్రతి రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యంపై ప్రజల్లో బాధ్యత పెరుగుతోందిని, ప్రజల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులపై పని భారం తగ్గడమే కాకుండా, నగర పరిశుభ్రత మరింత మెరుగుపడుతోందని, పరిశుభ్రమైన విజయవాడ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించడం ద్వారా నగరాన్ని ఆదర్శవంతమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాల్ నాయక్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *