Breaking News

వెల్ఫేర్ బోర్డు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి PTLPWA సదస్సులో వక్తల డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (PTLPWA), ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల సదస్సు స్థానిక యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. దీనికి ముఖ్య వక్తగా బొర్రా గొపిమూర్తి ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్స్ ఎంఏల్ సి పాల్గొని మాట్లాడారు. మీరు అడగకుండానే నేను మీ సమస్యలపై ఇప్పటికే రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. ప్రైవేటు ఉపాధ్యాయ, అధ్యాపకుల గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు ఇవ్వాలి. వెల్ఫేర్ బోర్డు, నిధిని ఏర్పాటు చేయాలి. ఉద్యోగ బద్రత కల్పించాలని డిమాండ్ చేశాను. ఇప్పుడు మీరు అదే సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ హక్కులు ప్రభుత్వం నుండి సాధించుకోవాలి అంటే మీరు ఐక్యంగా బలోపేతమై యూనిటీగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దానికి pdf mlc గా మేము నిరంతరము మీకు సహాయపడతామన్నారు. మాజీ mlc, jvv రాష్ట్ర అధ్యక్షులు కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ రోజు ప్రభుత్వం సంస్థల్లో కన్నా ప్రైవేటు రంగంలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితాలు సాధిస్తున్నారు అంటే మీ కృషే కారణం. కానీ కనీసం వేతనం లేదు. 12నెలల జీతం ఇవ్వడం లేదు. గౌరవం కూడా లేకుండా ఉన్నారు. కావున జీ. వో నెం.1 ప్రకారం ఫీజులో 50℅ ఉపాధ్యాయులు జీతాలకే కేటాయించాలని ఉన్న దానిని అమలు చేయడం లేదు. దీనిపై పోరాడి సాధించుకోవాలన్నారు. వీరి సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ వేర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వి నాగేశ్వరరావు మాట్లాడుతూ మనం రకరకాల విద్యాసంస్థలలో పనిచేస్తున్నా సమస్యలపై ఐక్యం అవ్వాలి. మనతో పాటు నాన్ టీచింగ్ స్టాప్ డిమాండ్స్ కూడా పెట్టి వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలి. అలాగే వినతులు, అన్లైన్వ పిటిషన్ ద్వారా సామూహిక సంతకాల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకొని పోవాలి. దానికీ సిఐటియు సంపూర్ణ సహాకారం అందిస్తోదని చెప్పారు. Ptlpwa రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి మనం కొన్ని హక్కులు సాధించుకోవాలంటే కిందస్థాయిలో యాజమాన్యాల సహాకారం తీసుకొవాలన్నారు. అలాగే 12నెలల జీతం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలయ్యే అన్ని సెలవులు ప్రైవేటు వారికి ఇవ్వాలి. యాజమాన్యాల నుండి వచ్చే సమస్యలు చెప్పుకునేందుకు 24గంటలు పని చేసే టోల్ ఫ్రీ నెంబర్ ప్రభుత్వం కేటాయించాలి. గుర్తింపు, హెల్త్ కార్డు ఇవ్వాలి. వెల్ఫేర్ బోర్డు, వనిధిని ఏర్పాటు చేయాలి. రక్షణ చట్టం చేయాలని చేసిన తీర్మానం ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సదస్సుకు ప్రొఫెసర్ ఎన్. లెనిన్ బాబు అధ్యక్షత వహించగా, ప్రకాశం జిల్లా ptlpwa అధ్యక్షులు కిరణ్ వేదిక మీదకు ఆహ్వానించారు. అసోషియేషన్ నాయకులు, శ్రీవాణి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, రమణ, మధు, సురేష్ బాబు, వాసునాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అనంతరం 23 మందితో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *