Breaking News

రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.మరో మూడు రోజులు పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు.

ఇవాళ సీజన్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1డిగ్రీలు నమోదైందని పేర్కొన్నారు.

13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు.17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు.ఇందులో ముఖ్యంగా ఏలూరు 23, తూర్పుగోదావరి 21, పశ్చిమగోదావరి 17, కృష్ణా 16, బాపట్ల 15, ఎన్టీఆర్ 14, పల్నాడు 13, కోనసీమ 12, కాకినాడ 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందన్నారు.

సోమవారం(25-05-2026)
29 మండలాల్లో తీవ్రవడగాల్పులు,166 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 50తీవ్ర, 205 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:

https://apsdma.ap.gov.in/files/82e68d25a07726c5737ba63772d8cd0a.pdf

☀️మే 25 సోమవారం

▪️కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పోలవరం, ఏలూరు,ఎన్టీఆర్‌,కృష్ణా, గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 45 – 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

▪️విజయనగరం, పార్వతీపురంమన్యం, కాకినాడ,మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 – 45 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

▪️శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు,విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 – 43 డీగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

🔸మరోవైపు ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది దీని ప్రభావంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు.

ఆదివారం తూర్పుగోదావరి(జి)
చిట్యాలలో 48.3డిగ్రీలు, పశ్చిమగోదావరి(జి) తణుకు, పల్నాడు(జి)
పిడుగురాళ్లలో 48.1,
ఏలూరు(జి) కుక్కునూరు
పోలవరం(జి)కూనవరం లో 47.3, కృష్ణా(జి) నందివాడలో 47.1, కోనసీమ(జి) రామచంద్రాపురం, కాకినాడ(జి)కాజులూరులో 46.5, బాపట్ల(జి) కూచినపూడిలో 46.2, ఎన్టీఆర్(జి) మైలవరంలో 45.7, విశాఖ రూరల్ 45.6, ప్రకాశం(జి) కారేడులో 45.5, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 45.2, మార్కాపురం(జి) నందనమారెళ్లలో 44.6 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *