Breaking News

మా పోరాటానికి సంఘీభావం తెలపండి

-అఖిలపక్ష నేతలకు ఉండవల్లి,పెనమాక, నిడమర్రు గ్రామ రైతుల విజ్ఞప్తి
-రాజధాని రైతుల ఉద్యమానికి అండగా నిలుస్తాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని రెండో విడత భూసేకరణ/సమీకరణ నుంచి తమ గ్రామాలను మినహాయించాలని, ఇప్పటికే భూములిచ్చి ప్లాట్లు ఇవ్వకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంపు భూసేకరణ/సమీకరణ ఆపాలంటూ ఇటీవల నుంచి ఆ ప్రాంత రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాల్ని అందజేశారు. అనంతరం న్యాయపరంగా, ప్రత్యక్ష పోరాటాలకు రైతులు సన్నద్ధులయ్యారు. ఈ క్రమంలో అఖిలపక్ష నేతలను కలిసి మద్దతు కోరడంలో భాగంగా శుక్రవారం విజయవాడ ఎంబీ భవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యను ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు సోమవారం కలిసి తమ పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక గ్రామాలను రాజధాని గ్రామాల నుంచి మినహాయించాలని తాము తీర్మానించుకున్నట్లు రైతులు తెలిపారు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ అమలు చేస్తే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండవల్లికి ఏం అభివృద్ధి చేసిందంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు రాజధానిలో లంక భూములు కొట్టేసి లాభపడితే… మేము మా సొంత భూములు త్యాగం చేయాలా? అంటూ వాపోయారు.
రాజధానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఉండవల్లి, పెనుమాక రైతులు తేల్చిచెప్పారు. మొదటిదశ భూ సమీకరణలో భూములివ్వని రైతుల్ని..ఇపుడు భూ సేకరణ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మÖడు పంటలు పండే 195 ఎకరాలను అనవసరంగా తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఈ భూ సమీకరణ అవసరం లేదని, మా ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదంటూ రైతులు చెప్పారు. రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకుంటుందని..గతంలో జనసేన నేత పవన్‌కళ్యాణ్ చెప్పారని, ఇప్పుడు దానికి విరుద్ధంగా రైతులు దగ్గర నుంచి బలవంతంగా భూములు ప్రభుత్వం సేకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు అండగా నిలవాలని కోరారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి భారీ స్థాయిలో ఉద్యమం చేయాలని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు రైతులు వెల్లడించారు.
మొదటిదశ భూ సేకరణలో తీసుకొన్న భూముల్ని అభివృద్ధి చేసి చూపిస్తే..నమ్మకం వచ్చేదనీ, ఇంతవరకు 12 ఏళ్ళయినా కాగితాలకే రైతుల ప్లాట్లు పరిమితమయ్యాయని తెలిపారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతుసంఘాలు తమ భూమి కోసం చేసే పోరాటానికి మద్దతివ్వాలని ఆయా గ్రామాల రైతులు కోరారు.
బలవంతపు భూ సమీకరణ ఆపాలి
– గుజ్జుల ఈశ్వరయ్య
రాజధాని ప్రాంతంలో రైతులపై బెదిరింపులకు పాల్పడి బలవంతపు భూ సమీకరణ/సేకరణ చేయడాన్ని తక్షణమే ఆపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. రైతులు చేసే ఉద్యమానికి సిపిఐ సంపూర్ణ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు. ఇప్పటికే అమరావతి రాజధాని పేరుతో తొలి విడతలో 55 వేల ఎకరాల భూ సమీకరణ చేపట్టారని, వాటికి సంబంధించిన రైతుల ప్లాట్లను ఇంతవరకు ఎక్కడా అభివృద్ధి చేయలేదని తెలిపారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ పేరుతో విడతల వారీగా మరో 50 వేల ఎకరాల భూ సమీకరణ చేపట్టడం తగదన్నారు. రాజధాని పనుల పేరుతో అప్పులు తెస్తూ.. ఒకే ప్రాంతంలో కోట్లాది రూపాయల నిధుల్ని వెచ్చించడం తగదని, దీనివల్ల ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని సిపిఐ ప్రకటించిందని గుర్తుచేశారు. మÖడు పంటలు పండే రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి, వాటిని కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడంతో భూములిచ్చిన అసలు రైతులకు నష్టం కలుగుతోందని తెలిపారు. ఇటీవల కొందరు పెద్దలకు రాజధానిలోని విలువైన ప్రాంతంలో ప్లాట్లను కేటాయించిన తీరే..ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి బలవంతపు భూ సమీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *