-ఈ నెల (27.05.2026) నుంచి దరఖాస్తులు స్వీకరణ
-సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026-27 విద్యాసంవత్సరానికి గాను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 16 ప్రిన్సిపాల్ పోస్టులు, 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), 133 కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) 52 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ) PETs) పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీతం, వయో పరిమితి, విద్యార్హతలు తదితర వివరాలకు http://kgbvrecruitment.apcfss.in వెబ్ సైట్ సందర్శించగలరు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 27.05.2026 నుండి 05.06.2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల్లో సాంకేతిక సమస్యల పరిష్కారానికి 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News