Breaking News

పిర్యాదుల పరిష్కారం పై విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోర్ట్ కేసులకు సంబంధించి పారావైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ ను ఎప్పటికప్పడు దాఖలు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ పై వేస్తున్న కోర్ట్ కేసులకు సంబంధించి మరియు పి.జి.ఆర్.యస్, కాల్ సెంటర్ కు వస్తున్న వివిధ పిర్యాదుల పరిష్కారం పై మరియు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
సమావేశం నందు తొలుత విభాగాల వారీగా కోర్టు కేసుల వివరాలను సమీక్షించి, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ విభాగాలకు సంబంధించి ఎక్కువగా కేసులు ఉండుట గమనించి అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పై ఫైల్ అయిన కేసులకు సంబంధించి వెంటనే పారావైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ ను దాఖలు చేయాలని విభాగాదిపతులను ఆదేశించారు. అంతేకాక అలాగే లోకాయుక్తకు సంబంధించిన కేసులకు కూడా కౌంటర్ ఫైల్స్ దాఖలు చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాదాన్యతనిస్తుందని, ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రజల నుండి వచ్చే పిర్యాదులను నిర్దేశిత గడువు పూర్తైనప్పటికి పరిష్కరించని అధికారులు మరియు సిబ్బంది పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. పిర్యాదుల పరిష్కారంలో సమస్యలేమైనా ఉంటె ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కాల్ సెంటర్ కు వస్తున్న పిర్యాదుల పరిష్కారంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజల వద్ద నుండి ఎక్కువగా ఏ సమస్య పై పిర్యాదులు అందుతున్నది గుర్తించి, వాటిని పరిష్కరించి, మరలా అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జ్) జి. సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, సిటీ ప్లానర్ రాంబాబు, యస్ఈ జి. వెంకటేశ్వర రావు, డి.సి.పి సూరజ్ కుమార్, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *