-అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించండి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు అందగా.. వీటిలో పోలీస్ 24, రెవెన్యూ 23, ఎంఏయూడీకి 14, పంచాయతీరాజ్11, సాంఘిక సంక్షేమం 9, విద్య 8, పౌర సరఫరాలు 6, డీఆర్డీఏ 5, ఉపాధికల్పన 4, ఏపీ సీపీడీసీఎల్ 3, హెల్త్ 2, గ్రామీణ నీటి సరఫరా 2, విభిన్న ప్రతిభావంతులు 2, సహకార 2, కార్మిక 2, హౌసింగ్,రోడ్లు మరియు భవనాలు, పంచాయతీరాజ్ ఇంజనీర్, అటవీ, వక్ఫ్ బోర్డు, ప్రజా రవాణా, దేవదాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాల్సిందేనన్నారు. నిబంధనలను పాటిస్తూ ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. .
Prajavartha Online Telugu News