Breaking News

ఎఫ్.ఆర్.ఎస్. సాంకేతికతతో మిస్సింగ్ బాలికను చాకచక్యంగా గుర్తించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలికను ఈ రోజు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలికను గుర్తించిన అనంతరం కేవలం 25 నిముషాల వ్యవదిలో క్షేమంగా అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది.

ఈ నెల 24వ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని బాలిక వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపడం జరిగింది. ఆ వివరాలను ఆర్.టి.జి.ఎస్. సిస్టమ్ నందు పొందుపరచగా సదరు బాలిక ఈ రోజు మధ్యాహ్న సమయంలో కమాండ్ కంట్రోల్ సిబ్బంది శ్రీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలలో కనిపించడంతో వెంటనే అప్రమత్తం అయ్యి సి.సి.ఎస్. పోలీస్ వారికి సమాచారం అందించగా వెంటనే సి.సి.ఎస్. వారు సదరు బాలికను గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది.

నేరాల నియంత్రణలో మరియు తప్పిపోయిన వారిని గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానం (FRS) ఎంతగానో దోహదపడుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రజల రక్షణే ధ్యేయంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘాను కొనసాగిస్తుంది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *