-‘మెడ్‌టెక్ ఛాలెంజ్ గ్రాండ్’ విజేతల ఎంపిక కూడా…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏఐ(Artificial Intelligence) ఆధారిత ఆరోగ్య వ్యవస్థ-వ్యూహాత్మక భాగస్వాముల సదస్సు, ‘ మెడ్ టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ‘ఫైనల్ కార్యక్రమం మంగళవారం మంగళగిరిలోని ‘జరగబోతుంది. ఆరోగ్య రంగంలో రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంకుర సంస్థలు, ఏజెన్సీల ముఖ్య ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఇతర రంగాలకు చెందిన వారు కలిపి సుమారు 300 మంది ఈ సదస్సు, మెడ్ టెక్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ప్రభుత్వాసుపత్రు(పైలట్ project)ల్లో ఏఐ ఆధారిత సేవలు అందించిన అంకుర సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను ఈ సదస్సులో ‘డెమో’ ద్వారా సభికులకు వివరించనున్నారు. మెడ్ టెక్ ఛాలెంజ్ గ్రాండ్ లో విజేతలుగా నిలిచే అంకుర సంస్థలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నగదు పారితోషికాలు అందచేస్తారు
4 కేటగిరీల్లో 18 అంకుర సంస్థల నూతన ఆవిష్కరణలు.
ఏపీ మెడ్ టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రకటనకు అనుగుణంగా డయాగ్నస్టిక్ టూల్స్ కేటగిరి, పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కేటగిరి, స్మార్ట్ మానిటరింగ్ అండ్ వేరియబుల్స్ కేటగిరి (శరీరానికి ఉప పరికరాలు అమర్చి), రిమోట్ కేర్ టెలిమెడిసన్ కేటగిరీల్లో 18 అంకుర సంస్థలు ప్రభుత్వాసుపత్రుల్లో తమ సేవలను అందించాయి. మొత్తం 37 రోజుల వ్యవధిలో సుమారు 15 వేల మంది రోగులకు వైద్యుల సమక్షంలో సేవలు అందించాయి. టీబీ, ఐ స్క్రీనింగ్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, నవజాత శిశువుల్లో శ్వాశ సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, రోగులతో వైద్యులు ఏఐ స్క్రైబ్ ద్వారా మాట్లాడడం, వంటి కొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవలు అందించడంలో పోటీపడ్డాయి. రోగులకు అందిoచిన వైద్య సేవలు, వాటి ఫలితాలను క్యాథ్ కమిటీ (కమిటీ ఫర్ అప్లైడ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్) 4 కేటగిరీల్లో ప్రోత్సాహకాల్ని అందించేందుకు సంస్థల్ని మంగళవారం ఎంపిక చేయనున్నారు. ఈ కేటగిరిల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చే అంకుర సంస్థలకు (మొత్తం 12) కూటమి ప్రభుత్వం రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున కలిపి మొత్తం రూ.40 లక్షలను ప్రోత్సాహాకాల కింద ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో జరుగనుంది. సీఎం శ్రీ చంద్రబాబు విజన్ అనుసరించి.. ప్రయోగాత్మక విధానంలో జరిగిన ఏఐ ఆధారిత సేవలు మంచి ఫలితాలు ఇచ్చాయి
వైద్య సేవల్లో ఏఐ వినియోగంపై ప్రత్యేక సదస్సు
వైద్య సేవల్లో ఏఐ వినియోగంలో బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి విడిగా జరిగే సదస్సులో పలువురు నిపుణులు వివరించనున్నారు. నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్ గోపాల్ వస్క, గోవిన్ క్యాపిటల్(సింగపూర్) ఫౌండర్ సిఇఓ డాక్టర్ ఆనంద్ గోవిందలూరి, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా డాక్టర్ వైవియస్ ప్రభాకర్, రెడిక్స్ ఇన్ఫినిట్ (టొరంటో, కెనడా) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ గణేషన్ వీరపాండియన్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబు సదస్సులో పాల్గొననున్నారు.
Prajavartha Online Telugu News