Breaking News

జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు

-కేంద్ర కార్యాలయం నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యవహారాలు పర్యవేక్షణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం అమలులోకి వస్తుంది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ నియమాలను దాటిన వారందరి నుంచి వివరణ తీసుకోవాలని కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహించేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త కమిటీని నియమించే వరకూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *