విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ప్రజాదర్బార్ లో కూటమి నేతలు అందజేశారు. 44 వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ కు చెందిన ధనాలకోట రమ్య (38) హెర్నియా తో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3 లక్షల ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు. 44 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, తెలుగు యువత నాయకులు దాడి మురళి కృష్ణ, ఎస్ఐ పీ శివ, పశ్చిమ చిరంజీవి యువతఅధ్యక్షుడు షేక్ మధు మస్తాన్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News