Breaking News

కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..

-రాష్ట్ర ప్రభుత్వానికి ‘కాపు రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రాతిపదికన12 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కె.ఆర్.పి.ఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘టిఆర్పీఎస్ గళం’ సమావేశంలో రాష్ట్ర ఛైర్మన్ చనమల్ల ప్రసాద్ రావు, కన్వీనర్ రావి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 99 శాతం మంది కాపు సామాజికవర్గం ఎన్డీయే కూటమికి అండగా నిలిచిందని, తమ చిరకాల వాంఛ అయిన రిజర్వేషన్లను తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి రిజర్వేషన్ల కోటాను పెంచాలని కోరారు. ముఖ్య డిమాండ్లు
విద్య, ఉద్యోగాలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి.
బీసీ రక్షణ చట్టం తరహాలోనే, కాపుల కోసం ప్రత్యేకంగా ‘కాపు రక్షణ చట్టాన్ని’ తీసుకురావాలి మహారాష్ట్రలో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లోనూ కాపులకు న్యాయం చేయాలి.
కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఈ అంశంపై ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు, కె.ఆర్.పి.ఎస్ ప్రధాన కార్యదర్శి కర్రీ వెంకటరమణ, నాయకులు తాడి నానాజీ, లంకా రాంబాబు, కాజా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *