Breaking News

ప్రజలకు సేవలు సులభంగా అందేలా బిజినెస్ రూల్స్ మారుద్దాం

-బిజినెస్ రూల్స్ మార్పునకు కార్యాచరణ సిద్దం చేయాలి
-టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది… నిబంధనల పేరుతో జాప్యం సరికాదు
-రోటీన్ పద్దతులకు స్వస్తి పలకాలి… వినూత్నంగా ఆలోచించాలి
-కుల ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తొలగించాలి
-ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని… ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా ఉండాలి కానీ.. నిబంధనలు అడ్డుకాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందే విధంగా చూడాలని… ఈ మేరకు అవసరమైన మేరకు బిజినెస్ రూల్స్ సవరించాలన్నారు. బిజినెస్ రూల్స్ సవరించాలని గతంలోనే అనుకున్నామని… దానికి సంబంధించిన కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు.. వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ప్రజల కోసం అధికారులు.. ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పని చేయడం ఎంత ముఖ్యమో… దానికి అనుగుణంగా ఫలితాలు చూపించడం కూడా అంతే ముఖ్యం. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. ఆ సమాచారం ఆధారంగా అధికారులు, ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలి. బాగా పని చేస్తున్న అధికారులను అభినందిద్దాం.. సరిగా పని చేయని అధికారులకు ఓరియేంటేషన్ క్లాసులు తీసుకుందాం. రోటీన్ పద్దతుల్లో పని చేయడం కాకుండా… వినూత్నంగా ఆలోచన చేయాలి.. సేవలను సులభతరం చేయాలి. రోటీన్ పద్దతుల్లో చేసే పని విధానానికి కాలం చెల్లింది. ప్రతి నియోజకవర్గానికి ప్రణాళిక శాఖ నుంచి నోడల్ అధికారులను నియమించాం. వారి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ప్రజలకు సేవలను త్వరితగతిన చేరవేసేందుకు బిజినెస్ రూల్స్ మార్చాలని గతంలోనే అనుకున్నాం. దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్దం చేయాలి.” అని సీఎం ఆదేశించారు.

కన్విన్స్ చేయాలి… సమస్యలు పరిష్కరించాలి…

“రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చాం. నిర్దేశించుకున్న ఏడాది గడువులో ఇప్పటికే కొంత కాలం ముగిసింది. పరిష్కారం కానీ సమస్యలపై ఫోకస్ పెట్టండి. ముఖ్యంగా కుటుంబ తగాదాలతో ఉత్పన్నయ్యే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధిత వ్యక్తులతో అధికారులు, ఉద్యోగులు మాట్లాడాలి. వారిని కన్విన్స్ చేయాలి. గొడవలు పడితే నష్టమే తప్ప.. లాభం ఉండదని వివరించాలి. వీలైనంత మేరకు సమస్యను పరిష్కరించేందుకు మానవీయ కోణంలో ఆలోచించి పని చేయాలి. ఇక కుల ధృవీకరణ పత్రాల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి… ఆన్ లైన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించేలా చూడాలి. అన్ని స్థాయిల్లోని ఆస్పత్రుల్లో సేవలందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్టీజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం పూర్తిగా అందించాలి… దీన్ని సమన్వయం చేసుకునేలా ప్రతి శాఖ నుంచి ఓ అధికారిని డిజిగ్నేట్ చేయాలి. సైబర్ ఫ్రాడ్స్ అరికట్టేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలి.”అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *