Breaking News

విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు ప్రతిపాదన పరిశీలన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం విజ్జేశ్వరంలో పర్యటించారు. విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు మూడు మండలాలు, 33 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు అవసరాన్ని ఇటీవల మంత్రి కందుల దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా రోడ్డు వేయాల్సిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.
విజ్వేశ్వరం, పురుషోత్తపల్లి, పందలపర్రు, పెండ్యాల, ఉసురుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం, కడింపాడు, దొంగరావిపాలెం తదితర గ్రామాలను కలుపుతూ నిర్మించాలని కోరుతున్న ఈ రోడ్డు వల్ల వేలాది మందికి ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు రవాణా మార్గం సులువు అవుతుందనీ, వరద కాలంలో గట్టు పర్యవేక్షణ ఈ రోడ్డు వల్ల సులభమవుతుందని చెప్పారు.
ఆ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఈ రోడ్డు నిర్మాణంపై ఒక నివేదిక ఇవ్వాలని, ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కి ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఉప ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు  నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *