Breaking News

రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా రీ సర్వే, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రీ సర్వే సేవలపై సానుకూల ప్రజా దృక్పథం తదితర అంశాలపై మాట్లాడారు. ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని సీసీఎల్ఏ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు.

ఒకవైపు రీ సర్వే, మరోవైపు ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణలో (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) కీలకమైన గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ సర్వేయర్లను సమన్వయం చేసుకుంటూ ఆయా పనులను పూర్తి చేసుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొనగా, ఆయనతోపాటు బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, సర్వే ఏడి కే లక్ష్మణరావు, కలెక్టరేట్ ఏవో రాధిక, భూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *