గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల సౌకర్యార్ధం గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ అన్నారు. నగరంలో వేసవి తీవ్రత దృష్ట్యా అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా అన్నా క్యాంటీన్లకు కూల్ రూఫ్ పెయింటింగ్ వేస్తున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సామాన్యుడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లలో మెరుగైన వసతుల కల్పించే విషయంలో ఎటువంటి రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరంలో ఎండ వేసవి తీవ్రత దృష్ట్యా అన్న క్యాంటీన్లకు వచ్చే సామాన్య ప్రజలు, కార్మికులకు ఇబ్బంది కలగకుండా ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం నగరంలోని మొత్తం 7 అన్న క్యాంటీన్ల పై యుద్ధప్రాతిపదికన కూల్ రూఫ్ పెయింటింగ్ వేయిస్తున్నామన్నారు. అంతేకాక ప్రజలు కూర్చోవడానికి, వేచి ఉండటానికి వీలుగా నీడ కొరకు ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా క్యాంటీన్లలో భోజన నాణ్యత, పరిశుభ్రత, రోజువారీ వసతుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ అధికారిని కూడా నియమించామని తెలిపారు.
Prajavartha Online Telugu News